DRDO Recruitment 2020: నిరుద్యోగులకు DRDO శుభవార్త.రూ. 31 వేల వేతనంతో ఉద్యోగాలు
నిరుద్యోగులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు రూ.31 వేల వేతనం చెల్లించనున్నారు.
నిరుద్యోగులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు రూ.31 వేల వేతనం చెల్లించనున్నారు.
నిరుద్యోగులకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్త ఆరు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఆన్లైన్ లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తద్వార ఎంపిక నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.31 వేల వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు డీఆర్డీఓకు చెందిన డిఫెన్స్ బయోఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ లాబరేటరీ(DEBEL), బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మెకానికల్ ఇంజనీరింగ్ లో BE, BTech పూర్తి చేసి NET, GATE లో స్కోర్ ఉన్న వారు, మెకానికల్ ఇంజినీరింగ్ లో MTech ఫస్ట్ క్లాసులో పాస్ అయిన వారి కోసం 4 పోస్టులు ఉన్నాయి. మిగతా వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
-ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో BE, BTech పూర్తి చేసి NET, GATE స్కోర్ కలిగిన వారి కోసం 1 పోస్టు ఉంది. ME, MTech పూర్తి చేసిన వారు సైతం ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
- పాలిమర్ సైన్స్, టెక్స్టైల్, టైక్స్టైల్ ఇంజినీరింగ్ లో BE, BTech చేసి NET, GATEలో స్కోర్ కలిగిన వారి కోసం 1 పోస్టు ఉంది. ME, MTech పూర్తి చేసిన వారు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివవాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు DRDO అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్లను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులపై సంతకం చేసి, కవాల్సిన డాక్యుమెంట్లను జత చేసి పీడీఎఫ్ ఫార్మట్లో hrd@debel.drdo.in మెయిల్ కు పంపాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment