DRDO Jobs 2020 | ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాసైనవారికి గుడ్ న్యూస్. డీఆర్‌డీఓ పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌లో ఉన్న నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబేటరీ-NMRL కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఒక ఏడాది అప్రెంటీస్ పోస్టులు ఇవి. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 9 చివరి తేదీ. అభ్యర్థులు తప్పనిసరిగా https://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
DRDO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 9
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు బీఎస్సీ కెమిస్ట్రీ, బీఏ, బీకాం పాస్ కావాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, పెయింట్ టెక్నాలజీలో డిప్లొమా పాస్ కావాలి. ఐటీఐ అప్రెంటీస్ పోస్టుకు పంప్ ఆపరేటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ల్యాబరేటరీ అసిస్టెంట్, వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్-కంప్యూటర్ ఆపరేటర్ ట్రేడ్స్‌లో ఐటీఐ, 10+2 అప్రెంటీస్‌కు ఇంటర్మీడియట్ పాస్ కావాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
స్టైపెండ్- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.9000. డిప్లొమా అప్రెంటీస్‌కు రూ.8000. ఐటీఐ, 10+2 అప్రెంటీస్‌కు రూ.7000
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు.
No comments:
Post a Comment