NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Oct 3, 2020

Work From Home Jobs if you have below skills

  NewNotifications       Oct 3, 2020

మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వెతుకుతున్నారా? కొన్ని స్కిల్స్ ఉంటే మీరు ఇంటి నుంచే పనిచేయొచ్చు. నెలకు రూ.30,000 వరకు సంపాదించొచ్చు. ఆ జాబ్స్ ఏవో తెలుసుకోండి.

WFH_Jobs
ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్ ద్వారా ప్రతినెలా 30 వేల వరకు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీ కోసం అందుబాటులో ఉన్న ఈ 5 మార్గాల గురించి తెలుసుకోండి. ఈ మార్గాల ద్వారా ప్రతినెలా మీరు కనీసం రూ.25 వేల నుండి రూ.30 వేల వరకు సంపాదించొచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

ఈ ఉద్యోగాన్ని మీరు ఇంటి నుండే చేయవచ్చు. దీనికి గాను ఇంటెర్నెట్ సౌకర్యం ఉన్న ఒక కంప్యూటర్ ఉంటే చాలు. మీరు ఈ వర్క్‌లో భాగంగా క్లయింట్‌ను కలుసుకోవడం, ప్రయాణించడం, కాన్ఫరెన్సులకు హాజరవ్వడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్ ద్వారా మీరు ప్రతినెలా రూ.27 వేల వరకు సంపాదించొచ్చు. అయితే ఈ వర్క్ చేయడానికి మీరు సంబంధిత ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కాగా మీ క్రియేటివ్ స్కిల్స్ మీద మీ శాలరీ ఆధారపడి ఉంటుంది.

అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్

ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. అందుకు అనుగుణంగా వాటిలో వాడే యాప్స్‌కి డిమాండ్ బాగా పెరిగింది. భారత ప్రభుత్వం ఈ మధ్య కాలంలో అనేక చైనా యాప్స్‌ని బ్యాన్ చేసింది. దీనిలో భాగంగా దేశీయంగా రూపొందించే యాప్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. మొబైల్ యాప్స్ తయారీలో మీరు ప్రొఫెషనల్ అయితే అవకాశాలకు కొదువలేదు. మోక్రియా డాట్ కామ్ వంటి అనేక యాప్ డెవలప్మెంట్ కంపెనీలు తాము చేపట్టబోయే నూతన ప్రాజెక్టుల్లో యాప్ డెవలపర్స్‌కి అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి. తద్వారా ఆన్లైన్లో ఇంటి నుంచే యాప్ డెవలపర్‌గా పనిచేస్తూ ప్రతినెలా కనీసం 20 వేల నుంచి 30 వేల వరకు సంపాదించొచ్చు. అయితే ఈ జాబ్ను అందిపుచ్చుకోవాలంటే మీకు సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్‌పై మంచి పట్టుండాల్సిందే.

ఆన్‌లైన్ అకౌంటెంట్

ఆన్‌లైన్ అకౌంటెంట్స్‌కు భారీగా డిమాండ్ ఉంది. ఆన్‌లైన్ అకౌంటెంట్స్ స్వయంగా ఒక ఆఫీసును ప్రారంభించి కంపెనీలతో టై అప్ అయ్యి వారి అకౌంట్స్‌ను హ్యాండిల్ చేయవచ్చు. మీరు ఇంటిలో నుంచే స్వయంగా కంపెనీ అకౌంట్స్‌ను చక్కబెట్టవచ్చు. దీనికి గాను మీకు ఆయా కంపెనీలు రూ.15 వేల నుంచి 20 వేల వరకు అందజేస్తున్నాయి. ఆన్‌లైన్ అకౌంటెంట్‌గా చేరాలంటే అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌పై పట్టుండాలి.

గ్రాఫిక్ డిజైనర్

గ్రాఫిక్ డిజైన్‌పై పట్టున్నవారికి ఈ రోజుల్లో మంచి డిమాండ్ ఉంది. మీడియా హౌజులు, ఫిల్మ్, యాడ్ ఏజెన్సీల్లో వీరి అవసరం ఎక్కువగా ఉంటుంది. గ్రాఫిక్ డిజైనర్స్ ఇంటి నుంచే ఫ్రీలాన్స్ పద్ధతిలో కంపెనీస్‌తో టైఅప్ అయి ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చు. దీనికి గాను ఆయా కంపెనీలు రూ. 10 వేల నుంచి 18 వేలకు చెల్లిస్తున్నాయి.

మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్

కార్పొరేట్ సెక్టార్‌లో మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్‌లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీని ద్వారా ఆయా కంపెనీలతో టైఅప్ అయి ఆన్లైన్లోనే బిజినెస్ చేయవచ్చు. కంపెనీ ప్రోడక్ట్స్‌పై కస్టమర్లు ఇచ్చే క్వాలిటీ రేటింగ్‌కు సంబంధించిన డేటాపై రీసెర్చ్ చేయడం మీ పని. దీనికి గాను ఆయా కంపెనీలు వారి ప్రోడక్ట్స్‌పై కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ను మీకు ముందుగానే అందజేస్తాయి. ఈ జాబ్‌ను ఫుల్ టైంగానే కాకుండా పార్ట్ టైమ్‌గా కూడా చేయవచ్చు. ఎంహెచ్ఐ గ్లోబల్, ఆర్బిట్జ్ వరల్డ్ వైడ్ వంటి అనేక కంపెనీలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆయా కంపెనీలు మార్కట్ రీసెర్చ్ అనలిస్ట్‌లకు ప్రతినెలా రూ.20 వేల నుంచి 30 వేలకు చెల్లిస్తున్నాయి.
logoblog

Thanks for reading Work From Home Jobs if you have below skills

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...