అసలే సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే టెన్షన్ ఓ రేంజ్‌లో ఉంటుంది. దానికి తోడు ఈ కరోనా కాలం ఒకటి. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు కాన్ఫిడెన్స్ కోల్పోకుండా రాయాల్సి ఉంటుంది.
ఎప్పుడూ లేనిది తొలిసారిగా. కరోనా కాలంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రిలిమ్స్ ఎగ్జామ్ నేడు (ఆదివారం అక్టోబర్ 4, 2020)న జరుగుతోంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ కేంద్రాలలో ఈ పరీక్ష జరుపబోతున్నారు. ఇందుకోసం అన్ని కోవిడ్ జాగ్రత్తలూ తీసుకున్నారు. మొత్తం 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 99 పరీక్షా కేంద్రాలలో 46,171 మంది పరీక్ష రాయబోతున్నారు. అభ్యర్థులకు ఎలాంటి టెన్షన్లూ లేకుండా చేశామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్నికల కో–ఆర్డినేటింగ్ సూపర్‌వైజర్ శ్వేతా మహంతి తెలిపారు. అటు వరంగల్‌లోని 16 కేంద్రాలలో 6,763 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నట్లు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.
- మొదటి కండీషన్ అందరికీ తెలిసిందే. అదే మాస్కు ధరించిన అభ్యర్థులను మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
- అభ్యర్థి తన అడ్మిట్ కార్డుతోపాటు. గుర్తింపు కార్డు కూడా వెంట తెచ్చుకోవాలి. లేదంటే పరీక్ష రాయడానికి ఒప్పుకోరు.
- మొబైల్స్, కాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. వాటిని తెచ్చుకునే అభ్యర్థులు వాటిని ఎక్కడ భద్రపరచుకుంటారన్నది నిర్వాహకులకు సంబంధం ఉండదు. అలాంటివి తెచ్చుకోవద్దని కోరుతున్నారు.- మొబైల్, కాలిక్యులేటర్లతోపాటూ. పర్సులు, వాచ్, పెన్‌డ్రైవ్, ఇయర్ ఫోన్స్ ఇతర రికార్డింగ్ పరికరాలు వేటినీ అనుమతించరు.
- ఎంట్రీ దగ్గరే థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. హ్యాండ్ శానిటైజర్లను పరీక్షా కేంద్రాల దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులు వాటిని ఉపయోగించుకోవచ్చు. హాల్‌టికెట్‌లో చెప్పిన చోటే కూర్చొని పరీక్ష రాయాల్సి ఉంటుంది. కరోనా పేరు చెప్పి. వేరే చోట రాస్తానంటే ఒప్పుకోరు.
No comments:
Post a Comment