నిశితా శిక్షణ అవగాహన కొరకు
- 06.10.2020 నుండి జరిగే నిష్టా శిక్షణ లో దీక్షా యాప్ ద్వారా 1 నుండి 8 వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు పాల్గోనాలి
- దీనికోసం ప్రతి ఉపాద్యాయుడు దీక్ష app డౌన్లోడ్ చేసుకుని వారి పేరు మీద ఒక అకౌంట్ (platform) కలిగి ఉండాలి
- యూజర్‌నేమ్ పాస్వర్డ్ గుర్తు పెట్టుకొండి. వీటి ద్వారా మాత్రమే ప్రతిసారి లాగిన్ అవ్వాలి
- ప్రతి ఐదు రోజులకు ఒక మాడ్యూల్ చొప్పున మొత్తం 18 మాడ్యూల్స్ పై శిక్షణ ఉంటుంది
- మొత్తం 18*5=90 రోజుల కార్యక్రమం ఉంటుంది
- ఉదాహరణకు మొదటి మాడ్యూల్ అక్టోబర్ 6 నుండి 10 వరకు
- రెండవది 11 నుండి 15 వరకు
- ఈవిధంగా దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుంది
- ప్రతి మాడ్యూల్ కి 5రోజుల సమయం కేటాయించటo జరుగుతుంది.
ఈ 5 రోజులలో
- మొదటి రోజు:- మాడ్యూల్ అధ్యయనం/దానికి సంబంధించిన వీడియోలు చూడటం
- రెండవ రోజు:- యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది. మీ సందేహాలను విషయ నిపుణుల ను అడగవచ్చు
- మూడవ రోజు:- మాడ్యూల్ అధ్యయనం/సంబంధిత వీడియోలు చూడటం
- నాల్గవ రోజు:- మీరు ఎంపిక చేసుకున్న కృత్యం తయారీ మరియు సబ్మిట్ చేయాలి.
- ఐదవరోజు:- మీరు తయారు చేసిన అస్సెస్మెంట్ సబ్మిట్ చేయాలి.
దీక్షా యాప్ నందు ఎప్పటికప్పుడు మాడ్యూల్ నందు మీ యొక్క ప్రోగ్రెస్ శాతంను గమనించుకోవచ్చు.
ప్రతి జిల్లాకి ఒక స్టేట్ రిసోర్స్ గ్రూప్ (SRG) ఉంటుంది.
ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది.
వాటి ద్వారా మీకు రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు.
శిక్షణ లో అన్ని అంశాలు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేయబడును.
ఈ కార్యక్రమాన్ని DEO గారు, SSA AMO'S,డైట్ అధ్యాపకులు, యస్.ఆర్.జీలు పర్యవేక్షిస్తారు. డైట్ ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు.
No comments:
Post a Comment