How to resolve the rejected RRB NTPC application
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB అతిపెద్ద నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. త్వరలో ఎన్‌టీపీసీ పోస్టులకు పరీక్షల్ని నిర్వహించనుంది. అభ్యర్థుల్ని తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవాలని ఆర్ఆర్‌బీ కోరుతోంది. అయితే దరఖాస్తు రిజెక్ట్ అయినవాళ్లు ఏం చేయాలో తెలియక అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. ఏం చేయాలో తెలుసుకోండి.
1. భారతీయ రైల్వేలో అతి పెద్ద నియామక ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB చేపడుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 35,308 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆర్ఆర్‌బీ. ఈ పోస్టులకు కోటీ 26 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
2. ఎన్‌టీపీసీ అభ్యర్థులు తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవాలని ఆర్ఆర్‌బీ నోటీసు జారీ చేసింది. అప్లికేషన్ స్టేటస్ లింక్‌ను యాక్టివేట్ చేసింది. సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.
3. మీరు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కు అప్లై చేసినట్టైతే http://rrbonlinereg.co.in/ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో Application Status లింక్ క్లిక్ చేయండి.
4. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అన్ని ఆర్ఆర్‌బీ రీజియన్స్ లింక్స్ ఉంటాయి. మీరు ఏ రీజియన్ నుంచి అప్లై చేస్తే ఆ రీజియన్ సెలెక్ట్ చేయండి. సికింద్రాబాద్ రీజియన్ అయితే Secunderabad పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
5. సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ పైన మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది. మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే మీరు పరీక్ష రాయడానికి అర్హత సాధించినట్టే. ఆ వివరాలను ప్రింట్ తీసుకొని కాపీ భద్రపర్చుకోండి. ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందో కారణంతో సహా ఉంటుంది.
6. సాధారణంగా ఫోటోలు, సంతకం సరిగ్గా లేకపోవడం, అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపకపోవడం, విద్యార్హతలు లేకపోయినా అప్లై చేయం లాంటి కారణాలతో దరఖాస్తులు రిజెక్ట్ అయ్యే అవకాశముంది. అయితే దరఖాస్తు రిజెక్ట్ అయిన అభ్యర్థుల్లో తమ అప్లికేషన్ ఎందుకు స్వీకరించలేదన్న ఆందోళన ఉంది.
7. దరఖాస్తు రిజెక్ట్ అయిన అభ్యర్థులు తమ తప్పులు సరిదిద్దుకోవడానికి మరో అవకాశం ఇవ్వాలంటూ ఆర్ఆర్‌బీని వేర్వేరు ప్లాట్‌ఫామ్స్ ద్వారా రిక్వెస్ట్ చేశారు. దీంతో అభ్యర్థుల ఫిర్యాదులను స్వీకరించేందుకు ఆర్ఆర్‌బీ హెల్ప్ డెస్క్ ప్రారంభించింది.
8. దరఖాస్తు రిజెక్ట్ అయిన అభ్యర్థులు https://rrbonlinereg.co.in/helpdesk/rrbContUs.aspx#! వెబ్‌సైట్‌లో కంప్లైంట్ చేయొచ్చు. ఇందులో 7 ప్రశ్నలకు సమాధానాలను డిఫాల్ట్‌గా వెల్లడించింది ఆర్ఆర్‌బీ. కామన్‌గా ఉండే సమస్యలపై వివరణ ఇచ్చింది.
9. ఇదే వెబ్‌సైట్‌లో Query డౌన్ డ్రాప్‌లో Others క్లిక్ చేసి తమ ఫిర్యాదు చేయొచ్చు. అందులో ఆర్ఆర్‌బీ జోన్, అప్లికేషన్ స్టేటస్, ఇమెయిల్ ఐడీ, రిజిస్ట్రేషన్ నెంబర్, పేరు, సమస్య వివరించి సబ్మిట్ చేయాలి.
10. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో 35,000 పైగా పోస్టులు భర్తీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 1,26,30,88 మంది అప్లై చేశారు. వీరిలో అన్ని అర్హతలు ఉన్నవారికి డిసెంబర్ 15 నుంచి పరీక్షల్ని నిర్వహించనుంది ఆర్ఆర్‌బీ.
No comments:
Post a Comment