Degree Fellowship-విద్యార్థులకు గుడ్ న్యూస్ నెలకు రూ.5,000 ఫెలోషిప్ పొందడానికి ఇలా అప్లై చేయండి
డిగ్రీ చదువుతున్నారా? ఆర్థికంగా చేయూత పొందాలనుకుంటున్నారా? నెలకు రూ.5,000 ఫెలోషిప్ ఇస్తోంది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-IISC బెంగళూరు. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.
1. డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. నెలకు రూ.5,000 ఫెలోషిప్ పొందే అద్భుతమైన అవకాశం ఇది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-IISC బెంగళూరు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన-KVPY ద్వారా ఈ ఫెలోషిప్స్ అందిస్తోంది.
2. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తరఫున ఈ ఫెలోషిప్స్ లభిస్తాయి. ఆసక్తి గల విద్యార్థులు http://kvpy.iisc.ernet.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 19 చివరి తేదీ.
3. మొదట 2020 అక్టోబర్ 5న దరఖాస్తు గడువు ముగుస్తుందని ప్రకటించారు. కానీ విద్యార్థులు దరఖాస్తు చేయడానికి మరిన్ని రోజులు అవకాశమిచ్చింది. గడువును 2020 అక్టోబర్ 19 వరకు పొడిగించారు.
4. జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ యాప్టిట్యూట్ టెస్ట్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. యాప్టిట్యూడ్ టెస్ట్ 2021 జనవరి 31న ఉంటుంది. పరీక్షా కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఉంటాయి.
5. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్‌తో పాటు ఎంఎస్సీ, ఎంఎస్ లాంటి కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేయొచ్చు. జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ యాప్టిట్యూట్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
6. డిగ్రీ విద్యార్థులకు రూ.5,000, మాస్టర్స్ విద్యార్థులకు రూ.7,000 చొప్పున ఫెలోషిప్‌తో పాటు ఏడాదికోసారి కంటింజెన్సీ గ్రాంట్ లభిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలు చేసేవారికి ఈ ఫెలోషిప్స్ లభిస్తాయి.
7. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్ట్స్‌తో డిగ్రీ, మాస్టర్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1250. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.625.
8. డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.5000 చొప్పున మూడేళ్లు, పీజీ విద్యార్థులకు నెలకు రూ.7000 చొప్పున రెండేళ్లు ఫెలోషిప్ లభిస్తుంది. దీంతో పాటు ఏడాదికోసారి డిగ్రీ విద్యార్థులకు రూ.20,000, పీజీ విద్యార్థులకు రూ.28,000 కంటింజెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది.
9. విద్యార్థులు దరఖాస్తు చేసేముందు http://kvpy.iisc.ernet.in/ వెబ్‌సైట్‌లో ఈ ఫెలోషిప్‌కు సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్ పూర్తిగా చదివి తమకు తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత http://kvpy.iisc.ernet.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
10. పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత ఫోటోగ్రాఫ్, సంతకం, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్‌లోనే ఫీజు పేమెంట్ చేయాలి.
No comments:
Post a Comment