AP-NHM Recruitment 2020 @77 posts
నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 77 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ఎం) కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 77 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 9 దరఖాస్తుకు చివరితేది. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలకు http://cfw.ap.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: 77
పోస్టులు: కన్సల్టెంట్స్, టెక్నికల్ ఆఫీసర్, పీడియాట్రీషియన్లు, గైనకాలజిస్ట్, బయోమెడికల్ ఇంజినీర్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ తదితర పోస్టులున్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ (మెడిసిన్)/ డెంటల్/ నర్సింగ్/ బీపీటీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, మాస్టర్స్ డిగ్రీ(సోషల్ సైన్సెస్), పీజీ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 18-45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 09, 2020
No comments:
Post a Comment